మొటిమలు తగ్గాలా? ఇంట్లో ఇలా చేయండి మొటిమలు తీవ్రంగా వేధిస్తే వాటిని భరించడం కష్టం. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. కలబంద రసాన్ని రాస్తే, అందులో అలోయిన్ మొటిమల్ని తగ్గిస్తుంది. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దీన్ని అప్లయ్ చేస్తే మంచిది. టోమోటాలను మెత్తగా పేస్టులా చేసి రాసుకోవాలి. ఇందులో ఉండే లైకోపీన్ మేలు చేస్తుంది. ఎర్ర కందిపప్పును నానబెట్టి, మెత్తని పేస్టులా చేసి అప్లయ్ చేయాలి. బంగాళాదుంప ముక్కలతో మొటిమలున్న చోట రుద్దాలి. ఐస్ క్యూబ్స్‌తో మొటిమలపై రుద్దాలి. హైపర్ పిగ్మెంటేషన్ సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.