చాలా మంది అల్పాహారంలో ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటూ ఉంటారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన శక్తివంతమైన ఎనర్జీ డ్రింక్ ఇది.


దీన్ని అధిక పరిమాణంలో వినియోగించినప్పుడు కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.



రక్తంలో చక్కెర పెరుగుదలకి కారణమవుతుంది.
అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పడిపోయే విధంగా చేస్తుంది.


కొన్ని అధ్యయనాల ప్రకారం ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం
వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


కొన్ని నివేదికల ప్రకారం నారింజ రసం చర్మ అలర్జీకు దారి తీస్తుంది.



నారింజ రసం అధిక మొత్తంలో తీసుకుంటే నిద్రలేమికి దారి తీయవచ్చు.



నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది అధికంగా తీసుకుంటే చర్మ చికాకు కలిగిస్తుంది.



కొన్ని నివేదికల ప్రకారం ప్రతిరోజూ 240 ఎంఎల్ వరకు నారింజ రసం తీసుకోవడం ఉత్తమం.



ఆమ్ల స్వభావం కలిగి ఉన్న ఆరెంజ్ పొట్ట సంబంధిత సమస్యలు, అసిడిటీకి కారణమవుతుంది.
Images Credit: Pexels