గుమ్మడి గింజలు ఎక్కువ తింటున్నారా? అయితే జాగ్రత్త! గుమ్మడి గింజలు ప్రొటీన్ రిచ్ ఫుడ్ కావడంతో వీటిని ఎక్కువగా తింటున్నారు. అయితే, ఎక్కువ తింటే ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు. గుమ్మడి గింజలల్లోని ఫ్యాటీ ఆయిల్స్ తో కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుమ్మడి గింజలు కొంత మందికి ఎలర్జీ కలిగించడంతో పాటు తలనొప్పి కూడా వచ్చేలా చేస్తాయి. గుమ్మడి గింజలల్లోని పోషకాలు, ఎక్కువ క్యాలరీల కారణంగా బరువు తొందరగా పెరుగుతారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లతో బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది. లో బీపీ ఉన్నవాళ్ళు తినకపోవడం బెస్ట్. చిన్న పిల్లలు వీటిని తినడం వల్ల కడుపునొప్పి, డయేరియా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. All Photos Credit: Pixabay.com