భారతీయ వంటకాల్లో జీలకర్రది ప్రత్యేక స్థానం. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కూడా.

అయితే జీలకర్ర వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే దుష్ప్రభావాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ మొత్తంలో తగ్గిస్తుంది. అందుకే డయాబెటిక్స్ జీరా వాటర్ తాగకపోవడమే బెటర్.

ఇలా జీలకర్ర నీళ్లు తాగినపుడు వాటిలోని సమ్మేళనాల వల్ల షుగర్ మోతాదుకు మించి పడిపోయి హైపోగ్లైసీమియా బారినపడవచ్చు.

జీలకర్రతో కడుపులో గ్యాస్ తగ్గుతుంది. కానీ ఒక్కోసారి వీటి వల్ల అసిడిటీ సమస్య రావచ్చు.

గర్భవతులు జీలకర్ర ఎక్కువ తీసుకుంటే సమయానికి ముందే ప్రసవం రావడం, తొలి రోజుల్లో అయితే అబార్షన్ జరిగే ప్రమాదం ఉంటుంది.

జీలకర్ర చాలా ఎక్కువ మొత్తంలో వినియోగిస్తే పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది.

జీలకర్రలో ఉండే నూనె వల్ల క్రమంగా లివర్, కిడ్నీల అనారోగ్యానికి కారణం కావచ్చు.

జీలకర్ర ఒక్కోసారి కడుపులో గ్యాస్ చేరేందుకు కారణమవుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో తేన్పులు వచ్చి ఇబ్బంది పెట్టవచ్చు.

జీలకర్ర ఎక్కువ తీసుకుంటే మగతగా ఉండడం, వికారం కూడా కలుగవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels