బుల్లితెర నటులు విష్ణు ప్రియ, సిద్దార్థ్ వర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2013లో '3జీ లవ్' అనే సినిమాలో నటించిన సిద్దార్థ్. ఆ తర్వాత 2014లో విష్ణు ప్రియతో కలిసి 'నేను నా ఫ్రెండ్స్'లో నటించాడు. 'దాగుడుమూత దండాకోర్', నాగ శౌర్య 'అబ్బాయితో అమ్మాయి' వంటి కొన్ని సినిమాల్లో నటించిన సిద్దార్థ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సిద్దు.. తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. బిగ్ బాస్ ఫేమ్ వాసంతితో రీల్స్ చేసిన సిద్దు. ఈ వీడియోలో వాసంతి.. బియ్యం బస్తాను ఒక్క చేత్తో లేప్ సిద్దూను ఆశ్చర్యపరుస్తుంది. తన లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. నువ్వే భార్యవవుతావంటూ హెచ్చరించింది. సిద్ధు 'తోడి కోడళ్లు', 'స్వాతి చినుకులు', 'అభిషేకం', 'ప్రతిఘటన' లాంటి సీరియల్స్ లో నటించాడు. Image Credits : Siddardhvarma/Instagram