విరాట్ కోహ్లీ 12 సంవత్సరాల ర్యాంకింగ్ రికార్డును శుభ్‌మన్ గిల్ బద్దలుకొట్టే అవకాశం ఉంది.

2011 నుంచి 2022 వరకు 12 సంవత్సరాల పాటు ఏడాది ముగిసేసరికి భారత్ తరఫున విరాట్ నంబర్ వన్‌గా ఉన్నాడు.

కానీ 2023లో ఆ రికార్డు బ్రేక్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది.

భారత్ తరఫున 2023లో నంబర్ వన్ బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలవవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లలోనే టాప్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.

టీమిండియా బ్యాటర్లలో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో ప్లేస్‌లో ఉన్నాడు.

ప్రస్తుతం 826 పాయింట్లతో శుభ్‌మన్ గిల్ టాప్‌లో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ 791 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ 769 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.

భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి జరగనుంది. దీని ద్వారా ర్యాంకింగ్స్ మారే ఛాన్స్ కూడా ఉంది.