'ఇష్టం' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రియా సరన్. శ్రియా తెలుగుతో పాటు పలు ఇంగ్లీష్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. అగ్ర హీరోల సరసన నటించిన శ్రియా.. రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ ను 2018లో రహస్య వివాహమాడింది. దక్షిణాదిలోని ఫిల్మ్ ఇండస్ట్రీలలో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరైన శ్రియా శరణ్ ఒక రష్యన్ ను పెళ్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో మొదటి సంతానానికి జన్మనిచ్చిన శ్రియా సరన్. తమకు పుట్టిన బిడ్డకు 'రాధ' అని నామకరణం చేసిన శ్రియా దంపతులు. తాజాగా తన కూతురితో వర్షంలో ఆడుతున్న వీడియో చేసిన శ్రియా. తాను నటించిన చిత్రాలను తన కుమార్తె పెద్దైన తర్వాత చూసి గర్వపడాలని ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పిన శ్రియా. ఒక వైపు నటిగా బిజీగా ఉన్న శ్రియా.. మరో వైపు తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. Image Credits : Shriya Saran/Instagram