శ్రీయా 2018లో రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత పండంటి ఆడ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. విదేశాల్లో సెటిలైపోయిన శ్రియా ఇక సినిమాలు చేయదని అంతా భావించారు. తనకు పాప పుట్టేవరకు శ్రియా కొన్నాళ్లు బయట ప్రపంచానికి కనిపించలేదు. శ్రియా ఇటీవలే తన కూతురు రాధాను ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ, నటనపై ఉన్న అభిలాషను శ్రియా చంపుకోలేకపోయింది. ఇటీవల RRRలో కీలక పాత్రలో కనిపించింది శ్రియా. శ్రీయ తన భర్త, కూతురితో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన బిడ్డతో ఆడుకుంటుంటున్నప్పుడు చిన్న పిల్లలా మారిపోతుంది. శ్రీయ పోస్ట్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మకు నిదర్శనం నువ్వే అందాల బొమ్మ అని అభిమానులు అంటున్నారు. Image Credit: Sriya Saran/Instagram