దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతా రామం’. ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘సీతా రామం’ సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ షోను దుల్కర్, మృణాల్ ప్రేక్షకులతో కలిసి చూశారు. హాల్ నుంచి బయటకు రాగానే ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా మృణాల్ దర్శకుడు హను రాఘవపూడిని పట్టుకుని ఏడ్చేసింది. ప్రేక్షకులు కూడా ‘సీతా రామం’ చూసి, చెమ్మగిల్లిన కళ్లతో బయటకు వచ్చారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజైంది. ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.