నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో హరికృష్ణ కె నిర్మించిన 'బింబిసార' నేడు థియేటర్లలో విడుదలైంది.

మహారాజు బింబిసారుడు అధికార కాంక్షతో రక్తపాతం సృష్టిస్తూ రాజ్యాలను ఆక్రమిస్తూ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు.

అధికారానికి అడ్డు వస్తాడని కవల సోదరుడు దేవ దత్తుడిని చంపడానికి కూడా బింబిసారుడు వెనుకాడడు. అలాంటి వ్యక్తిలో మార్పు వస్తుంది.

బింబిసారుడిలో మార్పుకు కారణం ఎవరు? అతని నిధి తలుపులు తెరవడం కోసం ప్రయత్నిస్తున్న శాస్త్రి ఎవరు? అనేది సినిమా.

కథ కొత్తది కాదు. కానీ, కథనం ఆసక్తికరంగా ఉంది. ప్రతి 15, 20 నిమిషాలకు ఒక మలుపుతో ఆసక్తి కలిగించింది.

ఇంటర్వెల్ తర్వాత సినిమా స్లో అయిన ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసినట్టు ఉంటాయి.

కేథరిన్ ఒక పాట, రెండు సీన్లలో కనిపిస్తారు. సంయుక్తా మీనన్ పాత్రకు ఇంపార్టెన్స్ లేదు.

మైనస్ పాయింట్స్ ఉన్నా... కీరవాణి సంగీతం, బింబిసారుడి క్యారెక్టరైజేషన్ సినిమాకు బలంగా నిలిచాయి.

సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కిన చక్కటి కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ 'బింబిసార'.

అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బింబిసారగా ఆయన నటన సినిమాకు మేజర్ హైలైట్.

మోడ్రన్ డ్రస్‌లో కళ్యాణ్ రామ్ చాలా స్టయిలిష్‌గా కనిపించారు. డైలాగ్ డెలివరీ సూపర్బ్.

మధ్య మధ్యలో కొన్ని లోపాలు ఉన్నా... స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసే చిత్రమిది. 

కళ్యాణ్ రామ్ కోసమైనా 'బింబిసార'ను తప్పకుండా చూడాలి. మహా చక్రవర్తిగా ఆయన నటన మెప్పిస్తుంది.

ఇదండీ 'బింబిసార' హైలైట్స్! పూర్తి రివ్యూ కోసం https://telugu.abplive.com/ వెబ్ సైట్ చూడండి.