నటి ఐశ్వర్య రాజేష్ ఐరోపా దేశాల్లో షికారు చేస్తోంది. స్నేహితులతో కలిసి అల్లరి చేస్తోంది.

ఇటీవల ఆమె పారీస్, రోమ్‌ నగరాలను చుట్టేస్తున్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఐశ్వర్య రాజేష్ మరెవ్వరో కాదు, తెలుగు నటుడు రాజేష్ కూతురు.

చెన్నైలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు తమిళం మీదే ఎక్కువ పట్టు ఉంది. తెలుగులో కూడా మాట్లాడగలదు.

ఐశ్వర్య రాజేష్ కొన్నేళ్లు తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యా నికేతన్‌లో చదివింది.

ఐశ్వర్య రాజేష్.. తెలుగు హాస్య నటి శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది.

ఐశ్వర్య తెలుగమ్మాయే, కానీ.. తమిళంలోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

తెలుగులో ముందుగా ‘రాంబంటు’ చిత్రంలో బాల నటిగా పరిచయమైంది.

'కౌసల్యా కృష్ణమూర్తి' అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత తెలుగులో 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్' సినిమాల్లో నటించింది.

‘సుడల్’ వెబ్ సీరిస్‌తో మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది ఐశ్వర్య.

Images & Videos Credit: Aishwarya Rajesh/Instagram