ఆ పోలీసులు చేతిలో ఉన్న మహిళ ఎవరో తెలుసా? శ్రియా శరణ్. ఆమెను అరెస్ట్ చేశానంటూ ఆ పోలీస్ పేర్కొన్నారు. ఇంతకీ, శ్రియను అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరో గమనించారా? ఈ పోలీసు ఎవరో కాదు, శ్రియ భర్త ఆండ్రూ కోశ్చీవ్. హాలోవీన్ పార్టీ కోసం ఆండ్రూ కోశ్చీవ్ ఇలా పోలీస్ గెటప్ వేశారు. 'చలో చలో' అంటూ పార్టీలో వాళ్ళను అరెస్ట్ చేశారు. ఆండ్రూకు శ్రియ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన గన్ ఫైరింగ్ చేసినట్టు యాక్ట్ చేస్తే... శ్రియ బులెట్ ఫైరింగ్ సౌండ్స్ ఇచ్చారు. భర్తతో కలిసి శ్రియ చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుమార్తె రాధ ఆడుకుంటున్న వీడియో, ఫోటోలను కూడా లేటెస్టుగా శ్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్రియ కుమార్తె, చిన్నారి రాధ ఏదో ఆలోచిస్తున్నట్టు లేదూ! భర్త ఆండ్రూ కోశ్చీవ్, అమ్మాయి రాధతో శ్రియ దీపావళి సందడి అమ్మాయి రాధ అంటే శ్రియకు పంచ ప్రాణాలు. ఇప్పుడు తన సమయంలో ఎక్కువ సేపు ఆమెకు కేటాయిస్తోంది. శ్రియ (All Images / Videos Courtesy : Shriya Saran and andreikoscheev / Instagram)