క్యూట్ బ్యూటీ ప్రణీత జర్మనీలో వెకేషన్ ఎంజయ్ చేస్తున్నది. పర్యటక ప్రాంతం ఈగల్ నెస్ట్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. భర్త నితిన్ రాజుతో కలిసి విహారయాత్ర చేస్తున్నది. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' సినిమాతో ప్రణీత తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టింది. బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస లాంటి సినిమాల్లో నటించింది. చక్కటి అందం, అభినయం ఉన్నా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిచ్చింది. 2010లో ‘పొర్కి’ అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రస్తుతం జర్మనీ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. Photos & Video Credit: Pranita Subhash/Instagram