మరాఠీ ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. 'కార్వాన్' సినిమా ఈమెకి మంచి బ్రేక్ ఇచ్చింది. అలానే 'లిటిల్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూత్ లో ఈమెకి మంచి క్రేజ్ ఉంది. అందుకే విశ్వక్ సేన్ తన 'ఓరి దేవుడా' సినిమాలో మిథిలాను హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. మిథిలాకు మాత్రం హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.