దీపావళి కానుకగా 'థాంక్ గాడ్' థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత రకుల్ మాల్దీవ్స్ వెళ్లారు. ఇప్పుడు రకుల్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ స్విమ్ సూట్, బీచ్ వేర్ లో సందడి చేస్తున్నారు. మాల్దీవుల్లో రకుల్ గోల్ఫ్ ఆడారు. ఆ వీడియో ఇది. ఇప్పుడు రకుల్ అంత బిజీ హీరోయిన్ ఎవరూ లేరేమో!? ఈ ఏడాది ఆమె సినిమాలు ఐదు విడుదలయ్యాయి. 'ఎటాక్', 'రన్ వే 34', 'కట్ పుత్లీ', 'డాక్టర్ జి', 'థాంక్ గాడ్' సినిమాలతో రకుల్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ అవకాశాలు అందుకుంటున్నారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రకుల్ పెళ్లి చేసుకోనున్నారని టాక్. అయితే... ఆవిడ స్పందించలేదు. (All Image Courtesy : Rakul / Instagram)