సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నతాజా సినిమా ‘డబుల్ ఎక్స్‌ఎల్’. సత్రమ్ రమణి దర్శకత్వంలో కామెడీ డ్రామాగా ఈ మూవీ రూపొందుతున్నది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. అధిక బరువున్న అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి చాలా బరువు పెరిగారు. ఇందులో రాజశ్రీ త్రివేది పాత్రలో హ్యూమా, సైరా ఖన్నా పాత్రలో సోనాక్షి కనిపిస్తారు. ఈ సినిమాతో టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. హుమా వాచ్‌ను మింగేస్తున్నట్లు మ్యాజిక్ చేసింది. ఆ తర్వాత సోనాక్షి చెంపపై కొట్టి.. ఆమె నోట్లో నుంచి బయటకు తీసింది. Photos & Video Credit: Huma Qureshi/Instagram