జలపాతం దగ్గర ఇంద్రధనస్సు చూస్తూ పరవశిస్తున్న ఈమెను గుర్తించారా? ఆమె మరెవ్వరో కాదు మెహ్రీన్! 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి, అందం, చలాకీతనంతో ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన ‘ఎఫ్ 3’ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ‘ఎఫ్ 2’లో హనీగా ఈమె చేసిన అల్లరిని ఆడియెన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. ‘రాజా ది గ్రేట్’, 'మహానుభావుడు' సినిమాలోనూ నటించి మెప్పించింది. ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాలో యాక్ట్ చేసినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. మెహ్రీన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photos Credit: Mehreen Pirzada/twitter