‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అద్భుత నటనతో సినీ జనాల హృదయాలను దోచుకుంది. ఓవైపు సీతామహాలక్ష్మీగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా నటించి ఫిదా చేసింది. ‘సీతారామం’ విజయంతో మృణాల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. సినిమా రంగంలోకి రాక ముందు మృణాల్ మోడలింగ్ లో రాణించింది. ఆ తర్వాత టీవీరంగంలోకి అడుగు పెట్టి పలు సీరియల్స్ లో నటించింది. 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమాలో హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. సినిమాల్లో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది. Photos Credit: Mrunal Thakur/Instagram