తెలుగు సినీ ప్రేక్షకులకు ఇలియానా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తొలి మూవీతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత నటించిన ‘పోకిరి’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనంతరం ఈ గోవా బ్యూటీ నటించిన పలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘జల్సా’తో మళ్లీ హిట్ అందుకుంది. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఓ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ప్రేమాయణం నడిపి, చివరకు బ్రేకప్ చెప్పింది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో మళ్లీ తెలుగు తెరపై మెరిసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ లో బికినీలో సందడి చేసింది. Photos & Videos Credit: Ileana D'Cruz/Instagram