చాలా రోజుల క్రితమే తనకు పెళ్లైందని నటి పూర్ణ ఇటీవలే చెప్పింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది. తాజాగా హల్దీ సెరిమనీ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసింది. అరబ్ కంట్రీకి చెందిన ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఈ ఏడాది మేలో ఎంగేజ్మెంట్ కాగా, జూన్ లో దుబాయ్ వేదికగా తమ పెళ్లి అయ్యిందని తెలిపింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్లు వివరించింది. త్వరలో కేరళలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. 2007లో ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన పూర్ణ, హోమ్లీ పాత్రల్లో కనిపించిన మెప్పించింది. సీమ టపాకాయ్, అవును, అవును-2, లడ్డూబాబు, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా సహా పలు సినిమాల్లో నటించింది. Photos & Video Credit: Shamna Kkasim ( purnaa )/Instagram