సమంత ప్రధాన పాత్రలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన 'యశోద' ట్రైలర్ విడుదలైంది.

సరోగసీ గర్భం దాల్చిన మహిళగా 'యశోద'లో సమంత కనిపించారు. ఈ సినిమాలో డైలాగ్స్ చూడండి.

'నీకు ఎప్పుడైనా రెండు చప్పుళ్ళు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది!' - సమంత

'యశోద ఎవరో తెలుసు కదా! ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి' - సమంత

నీకు పెళ్ళయిందా? - ఉన్ని ముకుందన్. 
నచ్చిన అబ్బాయి కోసం వెతుకుతున్నాను - సమంత. 

నువ్వు కనే బిడ్డ ఏ బిలీనియర్ ఇంటికో, ఏ బిగ్ షాట్ ఇంటికో వెళుతుంది - వరలక్ష్మీ శరత్ కుమార్ 

ఆ బిడ్డను ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది - వరలక్ష్మీ శరత్ కుమార్ 

అంతా అయోమయంగా ఉంది యశోద! కాజల్‌కి కూడా అంతే... కళ్ళే తిరిగేవి. పాపం పిచ్చి పిల్ల, ఎక్కడుందో? ఏంటో? - దివ్య శ్రీపాద   

నీకు కావాల్సింది డబ్బు, వాళ్ళకు కావాల్సింది బిడ్డ - సమంతతో ఓ పాత్రధారి. 

మొన్న ఢిల్లీలో జరిగింది. ఇవాళ గల్లీలో జరిగింది. ఏం పీకుతారని అనుకుంటున్నారా? - రాజకీయ నేతగా రావు రమేశ్. 

ప్రపంచం నాలుగు వైపుల నుంచి వస్తున్న 122 మంది లేడీస్ పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళందరూ సూపర్ రిచ్ - మురళీ శర్మ

ధైర్యం ఉంటే బయటకు రా - సమంతకు సవాల్ విసిరిన విలన్ బ్యాచ్ మెంబర్. 

షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, శిల్పా శెట్టి, సన్నీ లియోన్ - వీళ్ళంతా సరోగేట్ పేరెంట్స్ : ఓ పాత్రధారి. 

ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు రాశారు.