రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె... కథానాయిక శివానీ రాజశేఖర్ శారీలో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. శివాని శారీ కట్టడం కొత్త ఏమీ కాదు. అయితే... లేటెస్ట్ శారీ ఫోటోలపై ఆమె స్నేహితులు చేసిన కామెంట్స్ ఆసక్తిగా ఉన్నాయి. శివాని స్నేహితులు, ఈషా రెబ్బా ఈ ఫోటోలకు 'ఏంటి సిగ్గే?' అని కామెంట్ చేశారు. 'కలర్ ఫోటో' ఫేమ్, యూట్యూబ్ ఫిలిమ్స్ చేసిన శ్రీవిద్య మహర్షి 'చంపేయ్ జనాలని' అని కామెంట్ చేశారు. శ్రీవిద్యకు 'నీ ట్రైనింగే' అని శివానీ రాజశేఖర్ రిప్లై ఇచ్చారు. దీపావళి సందర్భంగా ఆమె ఇలా ముస్తాబు అయ్యారు. సినిమాలకు వస్తే... ప్రస్తుతం విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 'జిలేబి' సినిమాలో శివాని నటిస్తున్నారు. 'జిలేబి' కాకుండా శివాని చేతిలో 'విద్యా వాసుల అహం' అని మరో సినిమా ఉంది. అందులో రాహుల్ విజయ్ హీరో. రాజ్ తరుణ్, శివాని జంటగా 'ఆహ నా పెళ్ళంట' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. (All Images Courtesy : shivani_rajashekar1 / Instagram) శివాని చెల్లెలు, హీరోయిన్ శివాత్మిక దీపావళి సందడి.