చాలా రోజుల క్రితమే తనకు పెళ్లైందని నటి పూర్ణ ఇటీవలే చెప్పింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది. తాజాగా వెడ్డింగ్ సెరిమనీ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసింది. అరబ్ కంట్రీకి చెందిన ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఈ ఏడాది మేలో ఎంగేజ్మెంట్ కాగా, జూన్ లో దుబాయ్ వేదికగా తమ పెళ్లి అయ్యిందని తెలిపింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్లు వివరించింది. త్వరలో కేరళలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. పూర్ణ పెళ్లి వేడుక ఆటాపాటలతో ధూంధాంగా జరిగింది. Photos & Video Credit: Shamna Kkasim ( purnaa )/Instagram