శ్రద్ధా దాస్ అందాన్ని వర్ణించాలంటే.. ఈ అక్షరాలు సరిపోవు. శ్రద్ధాను చీరలో చూస్తే.. అతిలోక సుందరి పొరపాటున భూమి మీదకు వచ్చేసిందా అనిపిస్తుంది. కంపేరిజన్ కాస్త అతిగా ఉన్నా.. ఆమె అభిమానులు మాత్రం అదే అనుకుంటున్నారు. చీరలో ఉన్న అందాన్ని చూపించాలంటే శ్రద్ధాదాస్ తర్వాతే ఎవరైనా. మీరు శ్రద్ధ చీర ఫొటోలు, వీడియోలు చాలానే చూసి ఉంటారు. తాజాగా పోస్ట్ చేసిన వీడియో చూస్తే మాత్రం, ఆమెలో తెలుగమ్మాయిని చూస్తారు. చక్కగా జడ వేసుకుని, లంగా ఓణీలో శ్రద్ధా దాస్ తెలుగుమ్మాయిలా మారిపోయింది. శ్రద్ధాదాస్ ఈ మధ్య ‘జబర్దస్త్’, ‘ఢీ-14’లో కూడా కనిపిస్తోంది. బహుశా ఆ ప్రభావం వల్ల కాబోలు.. శ్రద్ధా ఇలా కొత్త అవతారంలో కనిపించింది. శ్రద్ధా దాస్‌కు ప్రస్తుతం తెలుగులో అవకాశాల్లేవు. కానీ, హిందీలో ఓ వెబ్ సీరిస్ చేస్తోంది. Images and Videos: Shraddha Das/Instagram