‘సాహస వీరుడు - సాగర కన్య’లోని శిల్పాశెట్టి గుర్తుందా?

ఒకప్పుడు తన గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఇప్పటికీ అలాగే ఉంది.

ఇందుకు కారణం.. ఆమె రోజూ చేసే యోగాభ్యాసం. కంటి నిండా నిద్ర.

శిల్పా ఈ ఏడాది మే 12న సోషల్ మీడియాకు బై బై చెప్పింది.

కొత్త అవతారంతో కలుసుకుంటానంటూ బ్లాక్ ఫొటో పోస్ట్ చేసింది.

దీంతో అంతా ఆమె భర్త రాజ్ కుంద్ర వివాదమే ఇందుకు కారణమని భావించారు.

కానీ, నాలుగు రోజుల తర్వాత ఆమె సూపర్ ఉమెన్ గెటప్‌లో ప్రత్యక్షమైంది.

ప్రస్తుతం శిల్పాశెట్టి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సీరిస్‌లో నటిస్తోంది.

ఆ వెబ్ సీరిస్‌కు చెందిన ఒక ఫైట్ సీన్ మేకింగ్ వీడియోను శిల్పా శెట్టి పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో ఒకే టేక్‌లో శిల్పాశెట్టి ఫైట్ సీన్ పూర్తిచేసి ఔరా అనిపించింది.

Images & Videos Credit: Shilpa Shetty/Instagram