ఎంతటి స్టార్ కిడ్ అయినా.. సక్సెస్ కోసం చెమటలు చిందించాల్సిందే. అఖిల్ విషయంలో అదే జరుగుతోంది. ప్రతిభ, అవకాశాలున్నా.. హిట్ దక్కట్లేదు. అఖిల్ నటించిన సినిమాలన్నీ ఏవరేజ్‌గా ఆడాయి. అయితే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మాత్రం అఖిల్‌కు ఊరటనిచ్చింది. ఇప్పుడు ఆ హిట్‌ను నిలబెట్టుకునేందుకు అఖిల్ మరింత శ్రమిస్తున్నాడు. తన కొత్త సినిమా ‘ఏజెంట్’తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అఖిల్ తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. గోవాలోని ఓ జిమ్‌లో అఖిల్ కసరత్తులు చేస్తున్నాడు. గోవా వెళ్తే బీచ్‌లో మస్తీ చేయాలి గానీ, అక్కడా కసరత్తులేనా అని ఫ్యాన్స్ అంటున్నారు. Images & Videos Credit: Akhil Akkineni/Instagram