నెలసరిలో ఈ పండ్లు తినకూడదా?



మహిళ జీవితంలో నెలసరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా సమయానికి నెలసరి వస్తేనే ఆమె ఆరోగ్యం చక్కగా ఉన్నట్టు.



నెలసరి ఆలస్యం అవుతున్నా లేక రాకపోయినా ఖచ్చితంగా వైద్యులను కలవాల్సిందే.



నెలసరి సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల రుతుస్రావం అధికంగా అవుతుందనే అపోహ ఎక్కువ మందిలో ఉంది.



నెలసరిలో బొప్పాయి, పైనాపిల్ తినకూడదనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది.



పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినడం పూర్తిగా సురక్షితం. ఇది రుతు చక్రాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది.



పీరియడ్స్ సమయంలో పైనాపిల్స్ అధికంగా తినకూడదు. రెండు మూడు ముక్కలు తింటే చాలు.



ఎక్కువ పైనాపిల్ ముక్కలు తింటే అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.



నెలసరి సమయంలో శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. ప్యాడ్ మార్చుకున్న తర్వాత కచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కోండి.