అలెర్జీ ఉంటే బొప్పాయి తినకూడదా? బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ కొంతమంది ఆ పండును తినకూడదు. ఆరోగ్యవంతులు ప్రతి రోజూ బొప్పాయిని తినవచ్చు. పండులో సగం ముక్క తినవచ్చు. బొప్పాయి పాలలో లాటెక్స్ పదార్థం ఉంటుంది. బొప్పాయిని అధికంగా తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. తరచూ అలెర్జీ వచ్చే ప్రమాదం ఉన్న వారు బొప్పాయిని తినకపోవడమే మంచిది. గర్భిణులు కూడా బొప్పాయిని పూర్తిగా పక్కన పెట్టడమే ఉత్తమం. గర్భిణులు బొప్పాయిని తినడం వల్ల గర్భసంచి సంకోచ వ్యాకోచానికి గురవుతుంది. దీనివల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఉంది. బొప్పాయి పండులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బొప్పాయి పండును చిన్న ముక్క తినడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది. బొప్పాయిని తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.