యాంగ్రీ స్టార్ రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని. శివానీ రాజశేఖర్ రీసెంట్ గా శారీలో ఫోటో షూట్ చేశారు. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. శారీలో ఫోటో షూట్ చేయడంలో కొత్త ఏముందని అనుకుంటున్నారా? ఇంతకు ముందు కూడా శారీలో శివాని కనిపించారు. అయితే... ఈ ఫోటోలు స్పెషల్ అని చెప్పాలి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా శివాని కొత్తగా కనిపించారు. అందం అంటే మోడ్రన్ దుస్తుల్లో మాత్రమే లేదని, శారీలోనూ సెక్సీగా కనిపించవచ్చని శివాని చూపించారు. శివాని లేటెస్ట్ శారీ ఫోటో షూట్ స్టిల్స్ ఇవి శివానీ చీర కడితే చాలా అందంగా ఉంటారు. ఈ శారీలో మరింత అందంగా ఉన్నారు. ప్రస్తుతం శివానీ రాజశేఖర్ మెడిసిన్ చదువుతున్నారు. మిస్ ఇండియా పోటీలకు కూడా శివాని రాజశేఖర్ ప్రిపేర్ అయ్యారు. మెడిసిన్ పరీక్షల తేదీలతో మిస్ ఇండియా కాంపిటీషన్ డేట్స్ క్లాష్ అవ్వడంతో ఆ పోటీల నుంచి శివాని తప్పుకొన్నారు. రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ... తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శివాని. శివాని కథానాయికగా నటించిన 'అద్భుతం' సినిమా ఓటీటీలో విడుదలైంది. తండ్రి రాజశేఖర్ తో కలిసి 'శేఖర్' సినిమాలో శివాని నటించారు. ఇప్పుడు రాజ్ తరుణ్, శివాని జంటగా 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ చేస్తున్నారు.