ఆది పినిశెట్టి ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు.

చెన్నై ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌ ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.

ఈ ఫొటోలన్నీ ఆది తన మొబైల్‌తోనే తీశాడట.

‘‘నీలో మాంచి ఫొటోగ్రాఫర్ ఉన్నాడు’’ అని నెటిజన్స్ ఆదిని పొగిడేస్తున్నారు.

ఆది ఇటీవలే నటి నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్నాడు.

ఆది ‘వారియర్’ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడు.

అయితే, ‘వారియర్’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ప్రస్తుతం ఆది ‘పార్టనర్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు.

Image Credit: Aadhi Pinisetty/Instagram

Image Credit: Aadhi Pinisetty/Instagram

Image Credit: Aadhi Pinisetty/Instagram