బాలీవుడ్ సీనియర్ బ్యూటీ, పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1993లో 'బాజీగర్' సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల శిల్పాశెట్టి.. కొన్నేళ్ల పాటు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. 1996లో విక్టరీ వెంకటేష్ తో కలసి నటించిన 'సాహస వీరుడు సాగర కన్య' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది శిల్పా. సాగర కన్యగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ హాట్ బ్యూటీ.. మోహన్ బాబు సరసన 'వీడెవడండీ బాబూ' అనే చిత్రంలో నటించింది. 'ఆజాద్' మూవీలో కింగ్ అక్కినేని నాగార్జునకు జోడీగా నటించడమే కాదు, 'భలే వాడివి బాసూ' చిత్రంలో నందమూరి బాలకృష్ణతో ఆడి పాడింది శిల్పా. తెలుగులో నలుగురు అగ్ర హీరోలతో జత కట్టినప్పటికీ, ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అమ్మడు టాలీవుడ్ కు దూరమైంది. శిల్పాశెట్టి ఫ్యాషన్ మరియు ఫిట్నెస్ కు పర్యాయపదంగా ఉంటుంది. 48 ఏళ్ల వయస్సులోనూ హాట్ నెస్ తో అదరగొడుతుంది. సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉండే ఈ భామ.. రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్స్, వీడియోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. శిల్పాశెట్టి ప్రస్తుతం 'KD - ది డెవిల్' అనే కన్నడ చిత్రంలో కనిపించనుంది. అలానే 'సుఖీ', 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' సినిమాలలో భాగం కానుంది.