రష్మీ గౌతమ్ హిప్నటైజ్ చేస్తే? ఈ ఆలోచన కొత్తగా ఉంది కదూ! ఆవిడ ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ కూడా అంతే! 'If only I had blue eyes to hypnotize' అని ఈ ఫోటోలకు రష్మీ క్యాప్షన్ ఇచ్చారు. ఒకవేళ ఎవరినైనా హిప్నటైజ్ చేయడానికి తనకు నీలి రంగు కళ్ళు మాత్రమే ఉంటే? అని రష్మీ ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. ఓ టీవీ కార్యక్రమం కోసం రష్మీ గౌతమ్ ఇలా రెడీ అయ్యారు. ప్రజెంట్ 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోగ్రామ్స్ కు రష్మీ యాంకరింగ్ చేస్తున్నారు. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు సినిమాలు కూడా రష్మీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో రష్మీ గౌతమ్ నటించారు. రష్మీతో పాటు 'భోళా శంకర్'లో మరో యాంకర్ శ్రీముఖి కూడా నటించారు. రష్మీ గౌతమ్ ఫోటోలు (All Images Courtesy : rashmigautam / Instagram)