సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తర్వాత శేఖర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కథ: శేఖర్ (రాజశేఖర్) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంటారు.

తన మాజీ భార్య, కూతురు యాక్సిడెంట్‌లో మరణించడంపై విచారణ ప్రారంభిస్తారు. ఈ విచారణలో తేలిన నిజాలేంటి అన్నది సినిమా కథ

విశ్లేషణ: ఈ సినిమా ఫస్టాఫ్ చాలా నిదానంగా సాగుతుంది. కథకు సంబంధం లేని సన్నివేశాలు, పాటలు ఇబ్బంది పెడతాయి.

ఇంటర్వల్ దగ్గర నుంచి కథ ఊపందుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు రేసీగా సాగుతాయి.

క్లైమ్యాక్స్‌లో ట్విస్టులను రివీల్ చేసే కీలకమైన లాయర్ పాత్రకు ప్రకాష్ రాజ్‌ను ఎంచుకోవడం మంచిదయింది.

ఇన్వెస్టిగేషన్‌లో అక్కడక్కడా లాజిక్స్ మిస్ అయ్యాయి. ఊహించని ముగింపుతో సినిమాను ఎండ్ చేయడం కొంచెం షాకిస్తుంది.

అనూప్ రూబెన్స్ అందించిన పాటల్లో ‘కిన్నెరా’ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం పర్లేదు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ పేసీగా ఉండాల్సింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే... రాజశేఖర్ తన వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకుంటారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.