మే 22 ఆదివారం రాశిఫలాలు



మేషరాశి
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల ప్రవర్తనతో మీ మనసు సంతోషిస్తుంది. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. మీ జ్ఞాన పరిధి పెంచుకునే ప్రయత్నం చేయండి. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి రోజు.



వృషభరాశి
పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు. మీ సహోద్యోగులతో మంచిగా ఉండండి.



మిథునరాశి
మీరు తలపెట్టిన పనుల్లో కొంత ప్రతికూలత ఉంటుంది. సమయం వృధా చేయకుండా ఉండండి. ఎక్కువ డబ్బు ఖర్చుచేయకండి. కార్యాలయంలో మీ పనితీరు చాలా బాగుంటుంది. మీ తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాత కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించండి.



కర్కాటకరాశి
చిన్నపాటి అడ్డంకుల వల్ల మీరు తలపెట్టిన పనులు దెబ్బతింటాయి. వ్యాపారంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మీరు ఓపిక పట్టాలి. ఈ రోజు పని వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మనసు కలత చెందుతుంది.



సింహరాశి
ఎక్కువ పని చేయడం వల్ల అలసట వస్తుంది. మీరు ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్లో పడతారు. మీ చుట్టూ ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇంటి సమస్యలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు.



కన్యారాశి
ఈ రోజు రన్ ఆఫ్ ది మిల్ డేగా ఉంటుంది. ధనలాభం ఉండదు. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. పని ఒత్తిడి మీపై అకస్మాత్తుగా పెరుగుతుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రావడంలో సమస్య ఉండొచ్చు. ప్రేమ సంబంధాల్లో సంయమనం పాటించండి.



తులారాశి
ప్రయాణం వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. బంధువులతో అభిప్రాయ భేదాలు రావొచ్చు. ప్రవర్తనలో దూకుడు కారణంగా మీరు చాలామంది కోపానికి గురవుతారు. మీ ఖర్చులను నియంత్రించడం అవసరం ఉంది. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.



వృశ్చికరాశి
మీ ప్రత్యర్థుల సంఖ్య పెరగుతుంది. దంపతుల మధ్య బాంధవ్యంలో మాధుర్యం ఉంటుంది. మీ పిల్లల పురోగతిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంది. కండరాల నొప్పితో బాధపడతారు.



ధనుస్సు
కొత్తగా తలపెట్టిన పనుల నుంచి ప్రయోజనం పొందుతారు. పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొత్తగా తలపెట్టిన కొన్ని పనుల విషయంలో శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోవాలి.



మకరం
మీ ప్రవర్తన, పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను కలుస్తారు. ప్రేమ సంబంధాలకు కుటుంబ సమ్మతి లభిస్తుంది. మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి అదృష్టవంతులు అవుతారు.



కుంభరాశి
కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి.



మీనరాశి
ఈ రోజు ప్రతి పని సులభంగా పూర్తవుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మీరు ప్రణాళికల ప్రకారం పనిచేయాల్సి రావొచ్చు. మీరు కొత్త స్నేహితులను కలుస్తారు. మీ ప్రత్యర్థులను నిర్లక్ష్యం చేయవద్దు.