బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు.

ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం మాత్రం తెలియరాలేదు.

బాలీవుడ్‌లో 2023 షారుక్ నామ సంవత్సరం అని మాత్రం చెప్పవచ్చు.

2023 ప్రారంభంలో షారుక్ ఖాన్ ‘పఠాన్’ విడుదల అయింది.

ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

2023 సెప్టెంబర్‌లో అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘జవాన్’ ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది.

దీంతో ఒకే సంవత్సరంలో షారుక్ ఖాన్ రెండు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు.

ఈ రెండు సినిమాలూ భారతదేశంలో చెరో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించాయి.

సంవత్సరం చివర్లో వచ్చిన ‘డంకీ’ కూడా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది.