బాలీవుడ్ బాద్‌షా ముంబై ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లకు కనిపించారు.

ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం తెలియరాలేదు.

డిసెంబర్ 21వ తేదీన షారుక్ ఖాన్ ‘డంకీ’ విడుదల కానుంది.

ప్రభాస్ ‘సలార్’తో కింగ్ ఖాన్ పోటీ పడనున్నాడు.

డిసెంబర్ 22వ తేదీన ‘సలార్’ విడుదల కానుంది.

ఇది కాకుండా షారుక్ చేతిలో ప్రస్తుతం ఏ సినిమా లేదు.

కానీ కూతురు సుహానా ఖాన్‌తో కలిసి ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్ డైరెక్టర్ సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ అని వార్తలు వస్తున్నాయి.

అనంతరం ‘పఠాన్ వర్సెస్ టైగర్’లో కూడా షారుక్ నటించనున్నారు.