షారుక్ ఖాన్ ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది.

ఈ సినిమా హిందీ వెర్షన్ మొదటి రోజు రూ.65.5 కోట్లు రాబట్టింది.

ఇది ప్రీవియస్ రికార్డు కంటే ఏకంగా 19.09 శాతం ఎక్కువ.

ప్రీవియస్ రికార్డు కూడా షారుక్ ఖాన్ పేరు మీదనే ఉంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన పఠాన్ ఈ రికార్డు సాధించింది.

ఈ సినిమా మొదటి రోజు రూ.55 కోట్లు కొల్లగొట్టింది.

రెండో రోజు కూడా ‘జవాన్’ రూ.50 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.

ఇక వీకెండ్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి.

మొదటి నాలుగు రోజుల్లో రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా.