బాలీవుడ్‌లో మంచి కపుల్స్‌లో షారుక్ ఖాన్, గౌరి ఖాన్ ముందు వరుసలో ఉంటారు.

1984లో షారుక్, గౌరి మొదటి సారి కలిశారు. గౌరి పూర్తి పేరు గౌరి చిబ్బర్.

వీరిద్దరూ 1991 అక్టోబర్ 25వ తేదీన వివాహం చేసుకున్నారు.

బుధవారానికి వీరి వివాహం అయి 32 సంవత్సరాలు పూర్తయ్యాయి.

1997లో వీరికి మొదటి కొడుకు ఆర్యన్ ఖాన్ పుట్టాడు.

ఆ తర్వాత 2000లో కూతురు సుహానా ఖాన్‌కు గౌరి జన్మనిచ్చారు.

2013లో సరోగసీ ద్వారా ‘అబ్రామ్’ పుట్టాడు.

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను గౌరి ఖాన్ చూసుకుంటారు.

ఈ బ్యానర్‌పై షారుక్‌తో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

2004లో‘మై హూ నా’ నుంచి మొన్నటి ‘జవాన్’ వరకు ఇందులో ఎన్నో సినిమాలు ఉన్నాయి.