కింగ్ ఖాన్ షారుక్ రేపటితో (నవంబర్ 2వ తేదీ) 58వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.

లవ్ స్టోరీలతోనే షారుక్ స్టార్‌డం సంపాదించాడు. వీటిలో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయెంగే’ ముందు వరుసలో ఉంటుంది.

‘కుచ్ కుచ్ హోతా హై’ (1998)లో రాణి ముఖర్జీ, కాజోల్‌తో షారుక్ లవ్ గేమ్‌ను మర్చిపోవడం కష్టమే.

దేవదాసు (2002) సినిమాలో భగ్న ప్రేమికుడిగా షారుక్ కనిపించాడు.

మొహబ్బతే (2000) షారుక్ కెరీర్‌లో గేమ్ ఛేంజింగ్ లవ్ స్టోరీ.

‘కబీ ఖుషీ కబీ ఘం’లో (2001) కూడా గుండెలు పిండేసే ప్రేమకథను చూపించారు.

‘వీర్‌జారా’ను (2004) దేశంలోనే అత్యుత్తమ ప్రేమకథల్లో ఒకటి అని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

‘మై నేమ్ ఈజ్ ఖాన్’ (2010)లో ప్రేమ కోసం ప్రయాణం చేసే ముస్లిం పాత్రలో కనిపించారు.

‘జబ్ తక్ హై జాన్’ (2012) షారుక్ కెరీర్‌లో మంచి రొమాంటిక్ సినిమా.

ప్రేమకథగా తెరకెక్కిన ‘కబీ హాన్ కబీ నా’ షారుక్‌కు స్టార్‌డం తీసుకువచ్చింది.