మాజీ ప్రపంచ సుందరి, ఒకప్పటి యువత కలల రాణి ఐశ్వర్యా రాయ్ నేటితో 50వ సంవత్సరంలో అడుగుపెట్టారు. 1994లో ఐశ్వర్యా రాయ్ మిస్ వరల్డ్‌గా నిలిచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఇరువర్ (తెలుగులో ఇద్దరు)’ ఐశ్వర్యా రాయ్ మొదటి సినిమా. వెంటనే శంకర్ ‘జీన్స్’లో కూడా నటించారు. తమిళనాట మొదటి రెండు సినిమాల్లోనే శంకర్, మణిరత్నం వంటి లెజెండ్స్‌తో పని చేశారు. తెలుగులో ఐశ్వర్య కేవలం ఒక్క సినిమాలో మాత్రమే కనిపించారు. నాగార్జున ‘రావోయి చందమామ’లో ఐశ్వర్యను ఒక పాటలో చూడవచ్చు. తమిళంలో కూడా కేవలం మణిరత్నం, శంకర్ సినిమాల్లో మాత్రమే నటించారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయారు.