'కీడా కోలా' ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సందడి - అరుదైన వీడియో షేర్ చేసిన రౌడీ హీరో! 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. యూత్ లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని రౌడీ హీరో అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. 'టాక్సీవాలా', 'గీతా గోవిందం' వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ గా 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. విజయ్ దేవరకొండ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి. Vijay Deverakonda/Instagram