షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. ఇంతకు ముందు ‘డర్’లో షారుక్ ఖాన్ నెగిటివ్ రోల్‌లో కనిపించారు. అంతకు ముందు ‘బాజీగర్’లో కూడా యాంటీ హీరోగా మెప్పించారు. ఈ రెండు సినిమాలూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత ‘డాన్’ సిరీస్‌లో నెగిటివ్ హీరోగా మెప్పించారు. ‘డాన్’ సిరీస్‌లో పూర్తి స్థాయి నెగిటివ్ రోల్‌లో షారుక్ కనిపించారు. ఈ సిరీస్‌లో ‘డాన్ 2’ సినిమా కూడా విడుదల అయింది. ఈ రెండు సినిమాలూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ‘జవాన్’లో ఒక్క డైలాగ్‌లో నేను విలన్ అంటాడు తప్ప షారుక్‌ది విలన్ పాత్ర మాత్రం కాదు.