వాల్మీకీ రాసిన రామాయణంలో పవిత్ర నది సరయు ప్రస్తావన ఉంది ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమైన నదులలో ఒకటైన సరయు అయోధ్య నుంచి ప్రవహిస్తోంది ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి జల సమాధి అయి అవతారాలు చాలించారని పురాణాలు చెబుతున్నాయి సరయును గోగ్రా నది అని కూడా పిలుస్తారు. బిహార్‌లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో సరయు కలుస్తుంది రాముడు పుట్టిన అయోధ్య తీరంలో ప్రవహిస్తున్నందున, సరయులో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం సరయు తీరం వెంట పలు ఆలయాలు కొలువుతీరగా.. ఎన్నో ఘాట్లు సైతం ఉన్నాయి. పండుగలలతో పాటు ముఖ్యమైన రోజులలలో భక్తులు సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు హిమాలయాల (ఉత్తరాఖండ్)లో జన్మించే సరయు నది వేల కిలోమీటర్లు ప్రవహించి యూపీ మీదుగా బిహార్‌కు చేరి గంగలో కలుస్తుంది అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్టాపన ఉన్నందున సరయు నదిని చూడాలని భక్తులు కోరుకుంటున్నారు పవిత్ర సరయు నదిలో పుణ్య స్నానాలు ఆచరించాలని భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు