అయోధ్య రామ మందిరాన్ని మూడంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.

రామ మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు

గర్భగుడిలో శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం), ఫస్ట్ ఫ్లోర్‌లో శ్రీరాముని దర్బార్

తూర్పు వైపు సింహ ద్వారం నుంచి 32 మెట్లతో రామ మందిరం లోపలకు వెళ్లాలి

4 హాల్స్ - నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపాలు ఉన్నాయి

కాంక్రీటు కానీ, ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించారు.
వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు లిఫ్టుల ఏర్పాటు

ఆలయం 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి గుడి... ఉత్తరాన అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి

మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి, అగ్ని ప్రమాదాల నివారణకు నీటి సరఫరా, విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు

25,000 సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మాణం. దీని ద్వారా భక్తులకు వైద్య & లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు

ఆలయాన్ని భారత సాంప్రదాయ పద్ధతిలో, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్నారు.