'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్. ఆ తరువాత 'సింబా', 'లవ్ ఆజ్ కల్' వంటి సినిమాల్లో కనిపించింది. ఆ తరువాత ఈమె నటించిన 'కూలీ నెంబర్ 1', 'ఆత్రంగిరే' సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో సారా సైలెంట్ అయిపోయింది. మళ్లీ తన దూకుడు పెంచుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా అయింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇస్తాన్ బుల్ ట్రిప్ కి వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. కలర్ ఫుల్ బికినీలో సారా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.