సిగరెట్లతో అంధత్వం వచ్చే అవకాశం



ధూమపానం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.



క్యాన్సర్, గుండె జబ్బులతో పాటూ కంటి చూపు కూడా ధూమపానం వల్ల మందగిస్తుంది.



మాక్యులా అంటే రెటీనాకు వెనుక భాగంలో ఉండే చిన్న భాగం. ఇది రంగులను గుర్తించేందుకు, ఎదురుగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించేందుకు, కేంద్ర దృష్టికి అవసరం.



ధూమపానం వల్ల మాక్యులా క్షీణతకు కారణం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.



ధూమపానం కళ్లకు చికాకును కలిగిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ కు దారి తీస్తుంది.



ధూమపానం చేసేవారిలో దాదాపు పదేళ్ల ముందుగానే చూపు మందగించే సమస్య మొదలవుతుంది.



ధూమపానం మానుకోవాలని ఎంత చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.



ప్రపంచంలో పొగాకును అధికంగా వాడే అతి పెద్ద వినియోగదారు దేశం మనదే.