ఇంట్లో ఇలా మాల్పువా చేసుకోండి

మాల్పువా స్వీటు చూడగానే నోరూరేలా ఉంటుంది.

గోధుమపిండి - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
బేకింగ్ సోడా - చిటికెడు
పెరుగు - రెండు స్పూన్లు

నెయ్యి - రెండు స్పూనులు
యాలకుల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
బాదం, పిస్తా, జీడిపప్పులు - గుప్పెడు

ఒక గిన్నెలో గోధుమ పిండి రెండు స్పూన్ల చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు వేసి బాగా కలపాలి.

నీళ్లు పోసి జారుడుగా అయ్యే కలుపుకోవాలి. పెనంపై అట్లు పోయడానికి ఎంత జారుడు కావాలో, అంతే ఇక్కడా ఉండాలి.

అలా కలుపుకున్నాక ఒక ఇరవై నిమిషాలు అలా పక్కన పెట్టాలి.

ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్లు, పంచదార పోసి పాకం తీయాలి. అందులో యాలకుల పొడి కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి రుబ్బుని అట్టులా వేసి రెండు వైపులా బాగా కాల్చాలి.

ఆ కాల్చిన రొట్టెలను పంచదార పాకంలో వేయాలి. పాకాన్ని రొట్టెలు పీల్చుకుంటాయి. పైన జీడిపప్పులు, బాదం పప్పులు , పిస్తా రేకులు చల్లుకోవాలి. టేస్టీ మాల్పువా రెడీ అయినట్టే.