జూన్ 2 రాశిఫలాలు



మేషం
వ్యాపారంలో భారీ ధనలాభం ఉంటుంది. సహోద్యోగులతో సంతోషంగా ఉంటారు. శ్రమకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అన్ని పనులు మీరు అనుకున్నట్టే జరిగినట్టు అనిపిస్తుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు రావొచ్చు.



వృషభం
కార్యాలయ పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీరు అస్సలు ఇష్టపడని వ్యక్తులను కలవవలసి రావొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఎవ్వరితోనైనా మాట్లాడేటప్పుడు అసభ్య పదాలు వాడవద్దు.ఆర్థిక విషయాల్లో సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.



మిథునం
మీరు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో మీపనికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఒకేసారి చాలా పనులు చేయడం వల్ల మీపై ఒత్తిడి ఉంటుంది. నిలిచిపోయిన కేసుల విచారణ వేగవంతం అవుతుంది. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.



కర్కాటకం
అధిక పని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. నిబంధనలను పాటించండి. మీ జీవిత భాగస్వామితో గొడవ పడకండి. కార్యాలయంలో కోపాన్ని అదుపుచేసుకోండి. కష్టపడితేనే ఫలితం పొందుతారు. పనికిరాని విషయాలపై శ్రద్ధ తగ్గించండి. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండొచ్చు.



సింహం
బంధువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. నిరుద్యోగులకు వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపార పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త పథకాలపై డబ్బు పెట్టుబడి పెడతారు. కొంచెం కష్టపడితే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈరోజు మంచి రోజు అవుతుంది.



కన్యా
అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా అవసరమైన పనులను ఉదయాన్నే పూర్తి చేయండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఏదో టెన్షన్ వెంటాడుతుంది.



తులా
మీ సన్నిహితులతో సత్సంబంధాలు కొనసాగించండి.మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తిని కోల్పోతారు. మీ లోపాలను అధిగమించడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అతి విశ్వాసం మంచిది కాదు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.



వృశ్చికం
ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. కష్టపడి పని చేస్తే కానీ సత్ఫలితాలు రావు. బంధువులతో మనస్పర్థలు ఏర్పడొచ్చు. ప్రతికూల ఆలోచనలు మీ పనితీరుపై ప్రభావం చూపుతాయి. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.



ధనుస్సు
ఈ రాశి ఉద్యోగులు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ వ్యాపార పరిచయాలు పెరుగుతాయి. కార్యాలయంలో మీతో ఉన్నతాధికారులు చాలా సంతోషంగా ఉంటారు. మీ దినచర్యలో కొత్త అలవాట్లు చేర్చుకోవద్దు..ముఖ్యంగా బ్యాడ్ హ్యాబిట్స్. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.



మకరం
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో సహకారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ప్రయాణం చేయొద్దు. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఆఫీసులో మీకు ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.



కుంభం
తలనొప్పితో ఇబ్బంది పడతారు. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది కాదు. బడ్జెట్ అసమతుల్యత కారణంగా పనికి బ్రేక్ పడుతుంది. కర్మాగారాల్లో జాగ్రత్తగా పని చేయండి.ప్రేమ వ్యవహారంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మీరు గందరగోళానికి గురవుతారు.



మీనం
మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు ప్రారంభంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. పెద్ద వ్యాపార ఒప్పందాలు ప్రభావితం కావచ్చు. పితృ వివాద కేసులు వెంటాడతాయి. ధైర్యంగా అడుగుముందుకు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.