జూన్ నెల ఈ ఆరు రాశులవారికి అధ్భుతంగా ఉంది



మేషరాశి ( Aries)
మేషరాశివారికి జూన్ నెల గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కొంత పర్వాలేదు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఎంతో కష్టపడితే కానీ ఫలితం అందుకోలేరు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.



వృషభ రాశి (Taurus)
వృషభ రాశివారికి ఈనెల చాలా బావుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభసమయం. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయానికి లోటుండదు.



మిథున రాశి (GEMINI)
పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. జూన్ 17 తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు, స్టేషనరీ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో అనవసర వివాదాల జోలికి వెళ్లకండి. ఈ నెలలో మరింత శక్తి, సామర్థ్యాలతో పనిచేస్తారు. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి



కర్కాటక రాశి (Cancer)
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ధనం చేతికందుతుంది. వ్యవహారాలు కలిసొస్తాయి.ఈ రాశికి చెందిన పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో సీనియర్ల అనుభవాలను పరిగణలోకి తీసుకోండి.



సింహ రాశి (LEO)
చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు, టెలికమ్యూనికేషన్, ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రతివిషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు.



కన్య రాశి (Virgo)
ఈ రాశి వారికి జూన్ నెలలో కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కష్టపడితే మాత్రమే ఫలితాలు అందుకుంటారు. చేయు వృత్తి, వ్యాపారాలు అంత బాగా ఉండవు. అవమానకర సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.కుటుంబ సభ్యులతో అనవసర తగాదాలుంటాయి.



తులా రాశి (Libra)
తులా రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయానికి లోటుండదు. శారీరక శ్రమ తప్పదు. కొన్ని సమస్యల వలన మనోవేదనకు గురిఅవుతారు. స్త్రీ మూలక ఇబ్బందులు తప్పవు. కొన్ని పనులు చాలా సులభంగా పూర్తిచేయగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది.



వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశివారికి జూన్ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంటా-బయటా సంతోషం ఉంటుంది. కార్యాలయంలో బాస్ ఆశీస్సులు లభిస్తాయి. సంతానం ద్వారా మంచి వార్తలు వింటారు. ఇనుము వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కోపం తగ్గించుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి.



ధనుస్సు రాశి (Sagittarius)
వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సరైన సమయానికి ధనం చేతికందుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి.చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనస్సు రాశివారికి కూడా ఆరవ ఇంట శుక్రుడు ఉండడం వల్ల భార్యతో వివాదాలున్నప్పటికీ సమసిపోతాయి.



మకర రాశి (Capricorn)
వ్యాపారం బాగా సాగినా కుటుంబంలో సమస్యలు వెంటాడతాయి. ఆరోగ్యం బావుంటుంది. బంధువులతో వివాదాలుంటాయి. ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో చికాకులుంటాయి, అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు.



కుంభ రాశి (Aquarius)
వృత్తి వ్యాపారాల్లో అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. కొన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. తలపెట్టిన పనిని ఎలాగైనా పూర్తిచేయ సామర్థ్యం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.



మీన రాశి (Pisces)
చేసే వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. సృజనాత్మక పనులపై దృష్టి సారిస్తే లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో మీరిచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యత లభిస్తుంది. జూన్ నెలలో మొదటి 15 రోజులూ ఒడిదొడుకులు తప్పవ్. అనవసర ఖర్చులు తగ్గించుకోండి.