ఎప్పుడూ బిజీగా ఉండే యాంకర్ సుమాకు ఇప్పుడు బ్రేక్ దొరికినట్లుంది. ‘జయమ్మ’ సినిమాతో మళ్లీ నటిగా మారిన సుమ.. ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సుమ అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆమెను అక్కడ ఘనంగా సత్కరించారు. సుమకు మధ్యలో బ్రేక్ దొరికిందో ఏమో.. అక్కడే ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ వంటకాలను వడ్డించే తీరు చూసి సుమా ఆశ్చర్యపోయారు. ప్లేట్‌లోనే మండుతున్న ఫుడ్‌ను చూసి సుమ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. అయ్యో, అమెరికా ఫుడ్‌తో అన్ని తంటాలు పడుతున్నావా అని ఫ్యాన్స్ అంటున్నారు. Images and Videos Credit: Suma/Instagram